ఆర్టీసీ బస్టాండ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

85చూసినవారు
ఆర్టీసీ బస్టాండ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆహారం నాణ్యత లేదంటూ ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. హైదరాబాదు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హైకోర్టు న్యాయవాది జగదీష్ నంద్యాల ఆర్టీసీ బస్టాండులోని మమతా క్యాంటీన్లో ఆహారము ఆర్డర్ ఇవ్వగా క్యాంటీన్ నిర్వాహకులు ఇచ్చిన భోజనం నాణ్యత లేకపోవడంతో వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్