నంద్యాలలో గంజాయి సప్లయ్ ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులు అయ్యలూరు మెట్ట వద్ద టీషాపులో గంజాయి విక్రయిస్తూన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి ఐదు కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు శిరివెళ్ల మండలం చెందిన మద్దిలేటి, శ్రీనివాసులు, యూసుఫ్ లుగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.