నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో రోడ్డు పై నుంచి కాకుండా రోడ్డు పక్కన నుంచి నడవాలని గ్రామస్తులు వాపోతున్నారు. బిల్లలాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో రోడ్డు పై అస్సలు నడవలేమని దానికి కారణం మురుగునీరంతా రోడ్డుపై ప్రవహించడమేనని గ్రామస్తులు అంటున్నారు. ఎన్నో సార్లు నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు చర్యలు మాత్రం శూన్యమని తెలిపారు. రోడ్డు పక్కన నడవాలంటే పురుగు, పుట్రా ఉంటాయని అటు రోడ్డు పై నడవాలంటే మురుగునీరు ఉంటుందని దాంతో ఆ రోడ్డు పై నడవాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వస్తుందన్నారు.