నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి పాఠశాల ర్యాంకింగ్ ను మెరుగుపరచుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాల ర్యాంకింగ్, పదవ తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతంపై సమీక్ష నిర్వహించారు.