బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం నంద్యాల లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. అయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు ధన, ప్రాణ త్యాగాలు, పోరాటాలు చేయడం వలన స్వాతంత్రం వచ్చిందని దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగం వల్ల ఈరోజు మనము ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలన్నారు.