కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో, నంద్యాల లయన్స్ క్లబ్, ఐఎంఏ ల సంయుక్త సహకారంతో దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం సీనియర్ విభాగంలో క్విజ్ పోటీలను రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ రవి కృష్ణ క్విజ్ మాస్టర్ గా, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు శ్రీకాంత్, రవి ప్రకాష్ ల సహకారంతో ఈ క్విజ్ పోటీలో 7 పాఠశాలల నుండి ఐదు మందితో కూడిన జట్లు పోటీ పడ్డాయి.