నంద్యాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా షేక్ ఇస్మాయిల్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ సింగ్ రాణా ఆదేశాల మేరకు గురువారం బాధ్యతలు చేపట్టానన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సిబ్బంది పలువురు సిఐని అభినందించారు.