రాష్ట్రస్థాయి విద్యా శిక్షణ తరగతులు జయప్రదం చేయండి

80చూసినవారు
రాష్ట్రస్థాయి విద్యా శిక్షణ తరగతులు జయప్రదం చేయండి
నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో నందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను నంద్యాల జిల్లా నేతలు శుక్రవారం విడుదల చేశారు. కాకినాడలో జులై 8, 9, 10 తేదీలలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. జిల్లా కోశాధికారి సురేష్ నాయకులు హనుమంతు, తరుణ్, చంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్