స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశ , మధ్యాహ్నం భోజన, వివోఏ కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యూటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు ఇవ్వాలని నంద్యాల పట్టణంలో సిఐటియు కార్యాలయం నుండి తహాసిల్దార్ కార్యాలయం వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వినతి పత్రం డిప్యూటీ తాసిల్దార్ కి అందజేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు.