వినాయక నిమజ్జన మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి ఎ. పద్మజ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కమిటీ సభ్యులను సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని సెంటనరీ హాలులో వినాయక నిమజ్జన మహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అధికారులు, గణేష్ మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.