తితిదే ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం

58చూసినవారు
తితిదే ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం
మిడుతూరు మండలంలోని పీరుసాహెబ్ పేట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ సకల సంపదలను కలిగించి, సకల అభిష్టాలను నెరవేర్చే వ్రతమే వరలక్ష్మీ వ్రతమని తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్