ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు వస్తాయని సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ నరేంద్ర రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.