నంద్యాల జిల్లా, గోస్పాడు మండలం రాయపాడు గ్రామం వద్ద కుందూనది వరద ఉధృతిని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం పరిశీలించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బాధిత రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రైతుల పంట నష్టాన్ని సక్రమంగా నమోదు చేయాలని అధికారులను ఎంపీ బైరెడ్డి శబరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.