మహానంది మండలంలో చిరుతను వెంటనే పట్టుకోవాలంటూ వినతి

82చూసినవారు
మహానంది మండలంలో చిరుతను వెంటనే పట్టుకోవాలంటూ వినతి
మహానంది మండలంలో తిరుగుతున్న చిరుతను అధికారులు వెంటనే పట్టుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ ఇంచార్జ్ ఫయాజ్ తెలిపారు. నంద్యాల జిల్లా అటవీ శాఖ అధికారి అనురాగ్ మీనాను కలిసి వారు వినతిపత్రం అందించారు. గత ఐదు రోజుల నుండి మహానంది మండలంలో చిరుత తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి నుండి ప్రజలను కాపాడాలన్నారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్