నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఏపిడి, ఏపీఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి జనార్దన్ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.