ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టిడిపి కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన నంద్యాల తాలూకా సిఐ అశ్రార్ భాష శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రన్యాయశాఖ మైనార్టీసంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.