నంద్యాల అయ్యాలూరు మెట్ట శివారు ప్రాంతంలో రౌడీ షీటర్ సాయి అలియాస్ కవ్వ దారుణ హత్య సంఘటన నంద్యాల లో శుక్రవారం చోటుచేసుకుంది. నంద్యాల అయ్యాలూరు మెట్ట శివారు ప్రాంతంలో రౌడీ షీటర్ సాయి అలియాస్ కవ్వను గుర్తుతెలియని వ్యక్తులు దారుణ హత్య చేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు. పలువురి హత్య కేసు లలో ముద్దాయిగా సాయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. నంద్యాల ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.