నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్స్ కి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని విజయవాడలోని ఉండవల్లిలో ఆయన నివాసంలో కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలవెంకట్ గురువారం నంద్యాలలో తెలిపారు. యూనియన్ నాయకులు నాగన్న, చెన్నయ్య శానిటేషన్ యూనియన్ నాయకులు ప్రసాదు, గురుస్వాములు పాల్గొన్నారు.