ఈద్ నిర్వహించుకుంటున్న ముస్లిం సమాజానికి జమాఅతె ఇస్లామి హింద్ నంద్యాల నగర శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ శుభాకాంక్షలు మంగళవారం తెలిపారు. రమజాను మాసంలోని ఉపవాసాలు తమలో నింపిన నిష్ట, ఆకలిని సహించే సహనం భౌతికంగా శరీరంలో నిలిచే శక్తి సంవత్సరం అంతా వ్యక్తం కావాలని సమద్ ఆకాంక్షించారు. ఎందరో పేదలు కడుపు నిండా అన్నానికి నోచుకోలేక పోతున్నారు, ఒంటి పై బట్టలు లేని పేదవారిని శక్తిమేర ఆదుకోవాలని కోరారు.