కృష్ణా జలాల సద్వినియోగానికి ప్రాజెక్టుల అసంపూర్ణ మౌలిక నిర్మాణాలను పూర్తి చెయ్యడానికి అంత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. జలసంరక్షతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ కమీషన్ ఏర్పాటు చేయాలని అంప్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న శుక్రవారం అన్నారు. ప్రభుత్వం కార్యాచరణ చేపట్టే దశలో ప్రజా సంఘాల సూచనలు, అభిప్రాయాలను వెల్లడించడానికి ముఖ్యమంత్రి పునరాలోచించాలని అన్నారు.