రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు దివ్యాంగులకు పెన్షన్లు 3వేల నుంచి 6 వేలకు పెంచుతూ జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్న సందర్భంగా నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లను పెంచి జులై ఒకటో తేదీ నుండి ఇవ్వనున్నామన్నారు.