జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొణిదెల నాగబాబును నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేయాలని నాగబాబు సూచించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసైనికులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.