పత్తికొండలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకులు హోసూరు శ్రీనివాసులు, కోతిరాళ్ల గ్రామ సర్పంచ్ ఆంజినయ్య జెండా ఆవిష్కరించారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం వైసీపీ ఆవిర్భవించిందని తెలిపారు. 2029లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అభివృద్ధికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.