ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి సూచనల మేరకు వెలుగోడు శివారులో శనివారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ 3 ఓపెన్ డ్రింకింగ్ కేసులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ఇది భాగమని అధికారులు తెలిపారు.