అశ్వ వాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లు
ద్వాదశ జ్యోతిర్లింగల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజు అయిన బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు అశ్వ వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ గావించి అశ్వ వాహనంపై కొలువు తీర్చారు. ఆ తదుపరి స్వామి అమ్మవార్ల గ్రామోత్సవ క్రతువు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు, అర్చకులు పాల్గొన్నారు.