భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన 111వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ మూమెంట్ షబానా ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన భరతమాతకు ప్రతి ఒక్కరు ఆరాధించాలన్న నినాదాన్ని తామందరం పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు ఉన్నారు.