శ్రీశైలంలో కొనసాగిన భక్తుల రద్దీ

75చూసినవారు
ద్వాదశ జోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. వేకువజాము నుంచే భక్తులు కల్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి, అమ్మవార్ల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్