అధిక ఫీజులను నియంత్రించండి

74చూసినవారు
అధిక ఫీజులను నియంత్రించండి
ఆత్మకూరు ప్రాంతంలోని ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు దినేష్ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నాయని అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక ఫీజుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్