కళల పరిరక్షణకు దేవదాయ శాఖ కృషి: ఈవో

68చూసినవారు
కళల పరిరక్షణకు దేవదాయ శాఖ కృషి: ఈవో
ప్రాచీన కళల పరిరక్షణకు దేవదాయశాఖ కృషి చేస్తోందని శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు అన్నారు. కళారాధన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడకు చెందిన వాగ్దేవి నృత్య నికేతన్ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. స్థానిక కళారాధన మండపంలో కళాకారులు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఆలయ అధికారులు కళాకారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్