ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం: ఎంపీడీఓ

65చూసినవారు
ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం: ఎంపీడీఓ
బండి ఆత్మకూరు మండలంలో జులై ఒకటో తేదీన పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో విజయరావు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. మండలంలో మొత్తం 6, 656 పెన్షనర్లు ఉన్నట్లు తెలిపారు. వీరికి రూ. 4. 50 కోట్ల డబ్బులు పంపిణీ చేసేందుకు 137 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి ఇంటి దగ్గరికి వచ్చి సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్