మహానంది పుణ్యక్షేత్రంలో నూతనంగా మార్చి స్వాగత ఆర్బ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. మహానంది క్షేత్ర పరిధిలోని ఈశ్వర్ నగర్ కాలనీ వద్ద ఉన్న టోల్గేట్ వద్ద ఆర్చ్ బోర్డును మంగళవారం ఏర్పాటు చేస్తున్నారు. మహానంది క్షేత్ర సుందరీకరణ పనులు భాగంగా ఈ ఆర్చ్ బోర్డులను నిర్మిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నంద్యాల నుంచి మహానందికి వచ్చే దారిలో ఈ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.