జ్యోతిరావు పూలే బాటలో నడుద్దాం

60చూసినవారు
జ్యోతిరావు పూలే బాటలో నడుద్దాం
మహాత్మ జ్యోతిరావు పూలే బాటలో ప్రతి ఒక్కరు నడవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఎలీషా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరులోని సంగమేశ్వరం సర్కిల్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షత, అంటరానితనం వంటి రుగ్మతలను తొలగించడం కోసం పూలే ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.