బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో ఆదివారం శ్రీఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు కొనసాగాయి. ఇందులో భాగంగానే ప్రాతఃకాల సమయం నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు తదితర పూజ క్రతువులను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ నిర్వహించి విశేష పూజలు జరిపారు. అంతేకాకుండా క్షేత్ర పరిధిలోని వివిధ ఉప ఆలయాల్లో యధావిధిగా నిత్య పూజలు కొనసాగాయి.