శ్రీశైలంలో అమ్మవారికి సారె సమర్పణ

55చూసినవారు
శ్రీశైలంలో అమ్మవారికి సారె సమర్పణ
ఆషాఢమాసం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ దేవి అమ్మవారికి మంగళవారం శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు సాహితీరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది ఆ సమితి సభ్యులు, శివసేవకులు, భక్తులు సారె సమర్పించారు. ఈ సమర్పణలో పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెను సమర్పించారు. శ్రీమల్లికార్జున స్వామివారికి, బయలు వీరబద్రస్వామివారికి, సాక్షిగణపతిస్వామివారికి, పలు ఉపాలయాల దేవతామూర్తులకు వస్త్రాలను కూడా సమర్పించారు.

ట్యాగ్స్ :