ఆత్మకూరు పట్టణంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు కాలనీలైన లక్ష్మీ నగర్, ఏకలవ్య నగర్, కుబ్రా మసీద్ ఏరియా, గరీబ్ నగర్, ఇందిరానగర్ తదితర కాలనీలు నీటమునుగాయి. దీంతో మంగళవారం టిడిపి పట్టణ అధ్యక్షులు జెట్టి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం భాషలు ఆయా కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు భోజన సదుపాయం కల్పించారు.