నీట మునిగిన ప్రధమ నందీశ్వరాలయం

77చూసినవారు
పాములపాడు మండలంలోని ఇస్కాల గ్రామ సమీపంలో గల ప్రధమనందీశ్వరాలయం భవనాసీ నది ఉధృతానికి నీట మునిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షం కారణంగా భవనసీ నదిలో నీటి ప్రవాహం అధికమైంది. ఇదే క్రమంలో నది ఒడ్డున ఉన్న ప్రధమ నందీశ్వరాలయంలోకి వర్షపు నీరు వెళ్లడంతో ఆలయంలోని శివలింగం నీట మునిగింది. కాగా భవనాసిలో నీటి ఉధృతి ఉండడంతో పాములపాడు నుంచి ఇస్కాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్