అరెస్ట్ భయంతో పేర్ని నాని అలా మాట్లాడుతున్నారు: మంత్రి కొల్లు

53చూసినవారు
అరెస్ట్ భయంతో పేర్ని నాని అలా మాట్లాడుతున్నారు: మంత్రి కొల్లు
AP: మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. పేర్ని నానికి మతిభ్రమించిందని ఆరోపించారు. అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఎందరినో చరిత్రలో చూశామని, చాలా మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బురదజల్లే కార్యక్రమాలకు పేర్ని నాని పాల్పడుతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్