నారా లోకేష్ కార్యకర్తలకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. గ్రామంలో ఐక్యంగా ఉండాలని, పనులు జరగకపోతే మొదట మండల పార్టీ నాయకులను, ఆ తర్వాత ఎమ్మెల్యేను, చివరకు ఇంచార్జ్ మంత్రిని సంప్రదించాలని సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వాలని తెలిపారు. కార్యకర్తలు తమ సొంత పనులతో పాటు, ఇతరుల సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడవద్దని, పార్టీపై అలగవద్దని, మూడవ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, ప్రత్యక్షంగా విన్నవాటినే విశ్వసించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, లోకేష్, చంద్రబాబుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, మనుషులం కాబట్టి తప్పులు జరిగితే చెప్పాలని కోరారు.