ప్రైవేట్ స్కూళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్

79చూసినవారు
ప్రైవేట్ స్కూళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లు పెంచుతామని వెల్లడించారు. అలాగే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్