ఏపీలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించినట్టు లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.