ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ కానున్నారు. అనంతపురం జిల్లా పర్యటన ముగించుకున్న మంత్రి నారా లోకేష్.. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ కన్ఫర్మ్ కావడంతో హుటా హుటిన హైదరాబాద్ చేరుకున్నారు. నారా లోకేష్ శనివారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.