AP: కూటమి పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తోందన్నారు. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా జగనన్న ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటారన్నారు.