అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.