AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ మంగళవారం స్పందించింది. మీడియా కథనాలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. తన్మయి హత్య ఘటనపై నివేదిక పంపాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, నిందితులు బాలికను కొట్టి నిప్పంటించి చంపిన సంగతి విదితమే.