భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా రికార్డ్ సృష్టించాడు. ఖతార్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్ మూడో రౌండ్‌లో ఆయన తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్‌ను అధిగమించి 90.23 మీటర్ల రికార్డు త్రోను నమోదు చేశాడు. కానీ, చివరి రౌండ్‌లో జర్మనీ అథ్లెట్ జులియన్ వెబర్ 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. దీనికి ముందు నీరజ్ ఉత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు.