నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 20 వార్డులో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని 30 బైకులు సీజ్ చేశారు. అలాగే అనుమానితులను గుర్తించి వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని స్థానికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, మర్రిపాడు, సంఘం ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.