సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 38.665 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నుంచి మొత్తం 4,575 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఉత్తర కాలువకు 300, దక్షిణ కాలువకు 350, పెన్నా డెల్టాకు 3,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.