మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వరద బాధితులకు రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఖమ్మం, విజయవాడ తో పాటు పలు జిల్లాల్లో వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, వారందరిని ఆదుకోవడానికి తన వంతుగా ఆంధ్రకు రూ.25లక్షలు, తెలంగాణకు రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో తెలిపారు.