నెల్లూరు జిల్లా లోని చేజర్ల మండలం గ్రామ దేవత గంగమ్మ తల్లి తిరుణాల్లు శనివారం ప్రారంభమయ్యాయి. మతానికి అతీతంగా ఓ వ్యక్తి తన భక్తిని చాటుకున్నాడు. టిడిపి మైనార్టీ నాయకులు షేక్. సిరాజుద్దీన్ గంగమ్మ తల్లికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముస్లిం అయినప్పటికీ గంగమ్మకు పూజ చేయడంతో పలువురు ఆయన భక్తిని మెచ్చుకున్నారు.