సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు మండలంలోని కుప్పూరుపాడుకు శనివారం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు. తొలిసారి గ్రామానికి వచ్చిన మంత్రికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుంచి కుప్పూరుపాడు గ్రామం వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. బాణసంచా మోతలతో నినాదాలతో ఈ ర్యాలీ జాతరను తలపించింది. ఆయన తమ గ్రామంలో కాలు మోపడమే అదృష్టమని పలువురు ప్రజలు అన్నారు.